షిరిడి సాయి విద్యా సంస్థల్లో పర్యావరణ గణపతికి పూజలు

షిరిడి సాయి విద్యా సంస్థల్లో పర్యావరణ గణపతికి పూజలు

కోనసీమ: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలకు పూజలు చేయాలని చాటి చెబుతూ ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం వేదమంత్రాలతో పర్యావరణ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చుట్టూ మొక్కలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మట్టి ప్రతిమలతో పాటు ఆ విద్యా సంస్థ రూపొందించిన పూజా పుస్తకాలను ప్రదర్శించారు.