GREAT: యువతకి మూడు ఉద్యోగాలు
KNR:సైదాపూర్ మండలం వెన్కేపల్లికి చెందిన జంపాల లక్ష్మీ-పోచయ్యల కూతురు అనూష తెలంగాణ గ్రూప్ పరీక్షల్లో సత్తా చాటింది. ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆమె గ్రూప్-1లో అసిస్టెంట్ ట్రెజరర్‌గా, గ్రూప్-2లో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికైంది. అలాగే గ్రూప్-3లో 230వ ర్యాంక్ సాధించింది. దీంతో అమెని పలువురు అభినందిస్తున్నారు.