'ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా'
NTR: తిరువూరు బైపాస్ రోడ్ గ్యాస్ కంపెనీ సమీపంలో హై వే లైట్లు వెలగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ జగదల్ పూర్ జాతీయ రహదారి పై గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైవేల పై నూతనంగా లైట్లను ఏర్పాటు చేసినా ఎటువంటి ఫలితం లేదు, ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.