నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర
MNCL: దండేపల్లి మండలంలోని మేదరిపేటలో హనుమాన్ భక్తులు హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. మంగళవారం మేదరిపేటలోని హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌లో హనుమాన్ ప్లెక్సీని ఉంచి పూజలు చేశారు. అనంతరం మేదరిపేట నుంచి ముత్యంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పాల్గొన్నారు.