కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆఫీసర్‌కు అవార్డు

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం-2 ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జిల్లెళ్ళ సుస్మితకు ఉత్తమ ఆఫీసర్ అవార్డు లభించింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ అవార్డుల ప్రధానం చేశారు. సోమవారం సుస్మితకు కలెక్టర్ అవార్డును అందజేశారు.