'ఆధునిక వ్యవసాయ పద్ధతులతో దిగుబడిని పెంచుకోవచ్చు'

'ఆధునిక వ్యవసాయ పద్ధతులతో దిగుబడిని పెంచుకోవచ్చు'

NLG: నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. తిప్పర్తి (M) దుప్పలపల్లి రైతు వేదికలో జరిగిన సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు.