VIDEO: 'గురుకుల సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ప్రారంభం'

WGL: జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి శుక్రవారం ఉదయం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. డీసీవో అపర్ణ, ప్రిన్సిపల్ సముద్రాల సరిత సమక్షంలో అర్హులైన విద్యార్థుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సదా అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.