పనుల గుర్తింపు కోసం గ్రామసభ ఏర్పాటు
AKP: దేవరాపల్లి(M) బోయిలకింతాడ గ్రామ సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూరె. బాబురావు మాట్లాడుతూ.. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రణాళిక రూపొందిచేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు లబ్దిదారులు ఈకేవైసీ శతశాతం చేయడం జరుగుతుందని చెప్పారు.