1.5 లక్షల మంది భారతీయులు రిటర్న్
ఒమన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించగా, 10 మంది గాయపడినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.5 లక్షల మంది భారతీయులు ఆయా దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.