ప్రజలు ఎల్లపుడు అప్రమత్తంగా ఉండాలి

ELR: పెదవేగి మండలం లీలా గూడెం గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రామ కృష్ణ వారి యొక్క సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత గ్రామంలో శాంతి భద్రతలను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులతో చర్చించారు. నేరాల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.