సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆళ్లపల్లి మండలంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని రాయిపాడు గ్రామంలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.