మాజీ ఎమ్మెల్యే ను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

NRML: భైంసా పట్టణంలోని సంతోషి మాత మందిర కమిటీ సభ్యులు గురువారం మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్‌ను కలిశారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణం కొరకు వినతి పత్రంను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, మాజీ కౌన్సిలర్ చందు లాల్, మోహన్, సాయినాధ్ పాల్గొన్నారు.