పోడు భూములకు రుణాలు ఇవ్వాలని వినతి

KMR: పోడు పట్టా భూములు ఉన్న రైతులకు బ్యాంకు ద్వారా రుణాలు అందించాలని గాంధారి మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు సురేందర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు ఉన్నారు.