ఆదివాసి సంస్కృతి పరిరక్షణపై సీతక్క పిలుపు
BDK: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు. కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి గిరిజనుల ఆచారాలను రాబోయే తరాలకు అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.