కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు 940 మంది రిజిస్ట్రేషన్
WGL: కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈ నెల 27, 28 తేదీల్లో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరగనున్నాయి. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరవుతుండగా 940 మంది రిజిస్ట్రేషన్ చేశారు. 27న ప్రారంభం, 28న పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.