నేడు జిల్లాలో జాబ్ మేళా

నేడు జిల్లాలో జాబ్ మేళా

విజయనగరంలోని టీఏటీ ఐటీలో నేడు జాబ్ మేళా జరగనుందని డైరక్టర్ వెంకటేశ్వర రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిక్సన్, ప్రీమియర్, రేడియంట్, స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్, టీసీఎల్ తదితర సంస్థలు పాల్గొంటాయన్నారు. పది, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 28 ఏళ్లలోపు ఉన్న స్త్రీ, పురుషులు అర్హులన్నారు. రూ.13-25 వేల వరకు నెలసరి వేతనం అందనుందని ఆయన వెల్లడించారు.