చిప్పగిరిలో అంజినమ్మ మృతి.. ఎమ్మెల్యే నివాళులు
KRNL: చిప్పగిరి మండలం గ్రామానికి చెందిన కేసరి అంజినమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అక్కడికి చేరుకుని భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.