VIDEO: 'బాధ్యతగల ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి రావాలి'

WGL: KCR సత్తాఉన్న నాయకుడయితే పత్తాలేకుండా ఎందుకు పోయాడని మంత్రి సీతక్క మండిపడ్డారు. బాధ్యతగల ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా అవాకులు చెవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా తమప్రభుత్వం పరిచేస్తున్నదన్నారు. గత ప్రభుత్వం గొప్పలకు పోయి అప్పులు చేస్తే, తాము తిప్పలు పడుతున్నామన్నారు.