కోదాడలో మీసేవ కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
SRPT: కోదాడలోని మీసేవ కేంద్రాన్ని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ టీ. రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవలో సేవల నిర్వహణ, రుసుములు వసూళ్లు, టోకెన్ విధానం, డిజిటల్ రికార్డులు తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా కమిషనర్ కేంద్రంలో ప్రజలకు అందిస్తున్న సేవలను వివరంగా ఆరా తీశారు.