అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి

TG: HYDలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోడెం వీరయ్య గౌరవ అతిథిగా పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అటవీ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల సేవలను స్మరించుకున్నారు.