'అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం'

'అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం'

అన్నమయ్య: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వేతనాల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు.