VIDEO: మురుగునీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు

VIDEO: మురుగునీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు

కృష్ణా: ఉయ్యూరు బస్టాండ్ వెనుక ఉన్న శ్రీలంకకాలనీలో 4 నెలలుగా డ్రైనేజీ పూర్తిగా దెబ్బతినడంతో మురుగు నీరు రోడ్డుమీద రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఈరోజు తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.