రహదారి పై మృతుడి కుటుంబ సభ్యుల ధర్నా

రహదారి పై మృతుడి కుటుంబ సభ్యుల ధర్నా

HNK: భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం మంగళపల్లి శ్రీనివాస్ (48) ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు రహదారి పై బైఠాయించి ధర్నా చేశారు. మృతుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు.