తెగిన కరెంట్ వైర్లు.. తప్పిన పెను ప్రమాదం
SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి డ్రైవర్ తేజ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు రెండు గంటల సమయంలో సిరిసిల్ల డీఎస్పీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో రాత్రి వచ్చిన గాలితో తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడ్డాయి. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అటువైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ పరిస్థితిని గమనించి పెను ప్రమాదాన్ని తప్పించాడు.