వర్ధన్నపేటలో 6 వార్డులు బీఆర్ఎస్ ఖాతాలోకి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో ఆరు వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన వారిలో సిలువేరు కుమారస్వామి, గుజ్జ వీర రాఘవరావు, తిరుపతి సురేష్, భూక్య జ్యోతి, సింగర్ బోయిన రమా, తుమ్మల అరుణ ఉన్నారు. విజేతలు ఆర్వో వద్ద ధృవీకరణ పత్రాలు స్వీకరించి అనంతరం క్యాంపుకు తరలివెళ్లారు.