VIDEO: ప్రత్యేక అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి
CTR: ఉగాది పర్వదినం సందర్భంగా ఇవాళ పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు శ్రీవారి మూలవర్లను అభిషేకించి అలంకరించారు. తర్వాత భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని అందజేశారు.