చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్
జాంగ్వాన్(అరుణాల్ ప్రదేశ్‌కు చైనా పేరు) తమ భూభాగమంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ తీవ్రంగా ఖండించారు. 'అరుణాల్ భారత్ భూ భాగమే. ఈ విషయాన్ని చైనా తిరస్కరించినా ఇదే వాస్తవం. ఈ విషయంపై ఇప్పటికే భారత్ తన నిరసనను బీజింగ్ ఎదుట వ్యక్తం చేసింది. అంతర్జాతీయ విమాన ఒప్పందాలను ఉల్లంఘించడంపై చైనా ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు' అని మండిపడ్డారు.