ఎండాకాలం.. రైల్వే జనరల్ బెర్త్ ప్రయాణం నరకమే..!
HYD: సాధారణంగా రైల్వే ప్రయాణంలో జనరల్ బెర్త్ అత్యధిక రద్దీతో ఉంటుంది. HYD సికింద్రాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని రైళ్లకు జనరల్ బెర్తుల సంఖ్య గత కొంతకాలంగా తగ్గిస్తూ వస్తుండడంతో సమస్య పెరుగుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. వేసవి కాలంలో ఇక నరకం అనుభవించాల్సి వస్తుందని, జనరల్ బెర్తుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.