అనుమానాస్పదంగా యువకుడి మృతి

అనుమానాస్పదంగా యువకుడి మృతి

HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పెంబర్తి ప్రశాంత్ (29) సోమవారం పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద ప్రశాంత్ మృతదేహం కనిపించినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.