తేనె అధికంగా తీసుకుంటున్నారా?

తేనె అధికంగా తీసుకుంటున్నారా?

తేనె చాలా పోషక విలువలున్న సహజ తీపి పదార్థం. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.. గొంతు నొప్పికి ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలపై పూసినప్పుడు.. ఇన్ఫెక్షన్లను నివారించడంలో, త్వరగా మానేందుకు సహాయపడుతుంది. అయితే, దీనిలో అధికంగా చక్కెర ఉంటుంది కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. తేనెలోని కేలరీలతో బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.