అక్రమంగా పార్కింగ్.. లారీలకు జరిమానా

HYD: అక్రమంగా నిలిపిన లారీలకు GHMC సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ అహ్మద్ సైఫ్ ఉల్లాహ జరిమానా విధించారు. జియాగూడ మూసీ పరీవాహక ప్రాంతంలో డీసీ పర్యటించారు. 100 ఫీట్ల రహదారి మేకల మండీ వద్ద అక్రమంగా నిలిపిన లారీలను గమనించి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏఎంహెచ్‌వో, ఏసీపీ అధికారులు ఉన్నారు.