పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు, కల్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం జిల్లా నగర కమిషనర్ రాకేష్ చంద్ర ఇవాళ ఉదయం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి నగర శివారు వరకు పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలపై అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలిచ్చారు.