ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
SDPT: రూరల్ మండలం పుల్లూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోజువారిగా లోడ్ కాగానే ట్రక్ షీట్ జనరేట్ చేయాలని, రైతులకు చెల్లింపులలో జాప్యం జరగకుండా చూడాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడి ధాన్యాన్ని అన్నదాత మిల్, లక్ష్మీ నరసింహ మిల్లులకు పంపిస్తున్నట్లు సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు.