రెండేళ్ల బాలుడిపై కుక్క దాడి.. తీవ్ర గాయాలు
KMR: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన గాంధారి మండలంలోని నేరల్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. నేరల్ తండా జెమిని బాయ్, బాల్ సింగ్ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి బయటకు వెళ్లగా.. బన్సీబాయ్ ఇంట్లో పనిచేసుకుంటుంది. ఈ క్రమంలో బాలుడు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఓ కుక్క బాలుడిని తీవ్రంగా గాయపర్చింది.