కంభంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ప్రకాశం: కంభంలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని సాధుమియా వీధికి చెందిన sk.వలి తన భార్య కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి కదలకుండా పడి ఉండడంతో వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వలి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.