నందికొట్కూరులో దర్శనమిచ్చిన 'నో స్టాక్' బోర్డు

నందికొట్కూరులో దర్శనమిచ్చిన 'నో స్టాక్' బోర్డు

NDL: నందికొట్కూరు పట్టణంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని దాదాపు 7 పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు లేకపోవడంతో యాజమాన్యాలు ‘నో స్టాక్' బోర్డులు పెట్టాయి. పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బంకుల వద్దకు చేరుకుని, నిరాశతో వెనుతిరుగుతున్నారు. సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.