'జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి'

PPM: వచ్చే నెల 13న పాలకొండ కోర్టులో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పాలకొండ సివిల్ జడ్జి హరిప్రియ పిలుపునిచ్చారు. శనివారం కోర్టు హాలులో న్యాయవాదులతో సమావేశమైన ఆమె రాజీకి అవకాశం ఉన్న కేసులను సూచించాలని కోరారు. కేసుల రాజీ ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.