VIDEO: వనస్థలిపురంలో దంచి కొడుతున్న వర్షం
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండను తలపించిన వాతావరణంలో ఒక్కసారిగా సాయంత్రానికి మార్పు చోటుచేసుకొని భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచి కొడుతుండటంతో వాహనదారులు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.