అభివృద్ధి పనులకు ఎంపీ ప్రారంభోత్సవం
NRPT: ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామంలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఆమెకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, ఐమాక్స్ లైట్లను ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.