నేకనాపురంలో ఉచిత మంచినీటి సరఫరా

నేకనాపురంలో ఉచిత మంచినీటి సరఫరా

KDP: గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో సిద్దవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. శుక్రవారం రేషన్ డీలర్ ఎద్దుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా మంచినీటిని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత త్రాగునీటి సౌకర్యం రెండు రోజులు కొనసాగుతాయని డీలర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.