ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ATP: జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు కడప నుంచి మైదుకూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారు. బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించి స్త్రీశక్తి, దివ్యాంగశక్తి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. పథకాల ద్వారా అందుతున్న సౌకర్యాలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించారు. డ్రైవర్, కండక్టర్ల పనితీరుపై ఆరా తీశారు.