భుజంగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భుజంగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ రాజంపేట ఈవో వెంకట సుబ్బారెడ్డి,ఇన్స్పెక్టర్ జనార్ధన్,ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉంగరాల సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నగదును లెక్కించారు. మొత్తం రూ.5,30,736 భక్తులు సమర్పించినట్లు చెప్పారు. ఆ నగదను ఆలయానికి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.