నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే

SKLM: రైతే దేశానికి వెన్నుముకని, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండల నదీ ప్రవాహాలను, ముంపునకు గురైన పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. వర్షాలకు పంట పొలాలు అతలాకుతలమయ్యాయని, నష్టపోయిన రైతులను గుర్తించి, ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ప్రయత్నిస్తానాని తెలిపారు.