ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ

SRCL: ఎల్లారెడ్డిపేటలో మండలంలో గురువారం బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంపైన, జాతీయ జెండాపైన గౌరవం పెంచుకోవాలన్నారు.