రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
KDP: ఒంటిమిట్టలోని జడ్పీహెచ్ఎస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంటిమిట్టకు చెందిన శేఖర్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కడప నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని 108 లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.