రోడ్డుపై గోతులు.. మట్టితో కప్పారు..!
SKLM: ఎచ్చెర్ల పాత జాతీయ రహదారికి నుంచి షేర్ మహమ్మద్ పురం వరకు ఉన్న రెండు కిలోమీటర్ల తారు రోడ్డు గోతులు మయంగా మారింది. దీంతో మరమ్మతులు చేయకుండా గోతులను మట్టితో కప్పారు. వర్షం పడితే రోడ్డు బురదమయంగా మారుతుంది. నానా అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.