దుర్మార్గమైన పరిస్థితుల్లో ZPTC ఎన్నికలు: మాజీ మంత్రి

W.G: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు దుర్మార్గమైన పరిస్థితుల్లో జరిగాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారి కోయా ప్రవీణ్ చౌదరి ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీ ఓటర్లపై దౌర్జన్యం చేశారన్నారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.