VIDEO: 'పెద్ది' గ్లింప్స్‌కు చిరంజీవి ఫిదా
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 'పెద్ది' చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో కండలు తిరిగిన దేహంతో 'ఆటే నా పొగరు' అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియోను చూసిన చిరంజీవి.. సంతోషం వ్యక్తం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబును అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం SMలో పంచుకుంది.