ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది: అజర్‌బైజాన్
ఇరాన్ డ్రోన్లు తమ దేశంపై దాడి చేశాయని అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. విమానాశ్రయం, స్కూల్‌పై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారని తెలిపారు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.