పామూరులో ఆటోలపై స్పెషల్ డ్రైవ్
ప్రకాశం: వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని పామూరు సీఐ శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాత్రి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరియైన పత్రాలు లేని 13 ఆటోలకు జరిమానా విధించడం జరిగినది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు.తప్పనిసరిగా డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.